అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఈ రేసులోకి లేటుగా వచ్చిన లేటెస్టుగా తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ తన ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పరస్పరం విమర్శలతో అమెరికా ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది.
ఇక ఈ ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మార్చే తరుణం ఆసన్నమవుతోంది. కమలా హారిస్తో డిబేట్కు తాను రెడీ అంటూ ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాను చెప్పిన షరతులకు ఒప్పుకొంటే మూడు చర్చల్లో పాల్గొంటానని.. ఇందుకు హారిస్ అంగీకారం తెలుపుతారని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్-కమలతో డిబేట్‌కు సిద్ధమైనట్లు ఏబీసీ టీవీ ఛానల్ ధ్రువీకరిస్తూ.. వచ్చే నెల 10వ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందని ప్రకటించింది. దీనిపై కమలా హ్యారిస్ కూడా స్పందిస్తూ సెప్టెంబర్ 10న తాను కూడా రెడీ అని తెలిపారు.