రిపబ్లికన్ అభ్యర్థిత్వం రేసులో డొనాల్డ్ ట్రంప్ జోరు

-

ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నా.. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశంలో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పదవి పోయినా ఆయనకు రిపబ్లికన్ పార్టీపై పట్టు మాత్రం పోలేదు. తాజాగా ట్రంప్.. రిపబ్లికన్ అభ్యర్థిత్వం రేసులో దూసుకెళ్తున్నారు. కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో కమాండింగ్ విక్టరీ సాధించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. పార్టీపై తనకు ఏమాత్రం పట్టు తగ్గలేదని ఈ ఎన్నికల ద్వారా ఆయన నిరూపించుకున్నారు.

ఇక ఈ ఎన్నికల్లో రెండో స్థానం కోసం ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ (ఇండో అమెరికన్) పోటీ పడుతుండగా.. ఈ బరిలో నిలిచిన మరో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వరుసగా మూడోసారి కూడా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్  కాకస్లో జరిగిన పోటీలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version