ఈవెంట్లోనే చంపేస్తానంటూ.. వివేక్‌ రామస్వామికి బెదిరింపులు

-

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి తన ప్రసంగాలతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు ఇటీవల బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓటర్‌ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ సందేశం పంపాడు.

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ ప్రచారంలో భాగంగా రాబోయే ఈవెంట్ల సమాచారం గురించి ఓటర్లకు నోటిఫికేషన్లను పంపించగా ఓ వ్యక్తి వివేక్​ను చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్ పంపాడు. ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపుతానంటూ సందేశంలో పేర్కొన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఫోకస్ పెట్టారు. న్యూహాంప్‌షైర్‌లోని డోవర్‌ నుంచి టైలర్‌ ఆండర్సన్‌(30) అనే వ్యక్తి ఈ బెదిరింపు సందేశాలు పంపినట్లు గుర్తించి అరెస్టు చేశారు. తనకు బెదిరింపులు రావడంపై రామస్వామి స్పందిస్తూ.. వేగంగా స్పందించి నిందితుడిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థలకు, తనను రక్షించిన బృందాలకు కృతజ్ఞత తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version