అయ్యో పాపం!.. రూ.4 వేలు విరాళం ఇచ్చినందుకు 12 ఏళ్ల జైలు శిక్ష!

-

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపుగా రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై దురాక్రమణ కొనసాగిస్తున్న రష్యా.. ఆ దేశానికి మద్దతుగా నిలిచే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌కు సాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలిచ్చిన మహిళను కఠినంగా శిక్షించింది. కేవలం 51 డాలర్లు (సుమారు రూ.4200) ఇచ్చిన కేసులో ఆమెను దోషిగా తేల్చి.. 12ఏళ్ల జైలు శిక్ష విధించింది రష్యా కోర్టు.

A remand prisoner committed suicide in a mental hospital

రష్యాకు చెందిన సేనియా ఖవానా (33)అమెరికా వ్యక్తిని వివాహం చేసుకొని లాస్‌ ఏంజెలెస్‌లో స్థిరపడింది. కొంతకాలం క్రితం ఫ్యామిలీని చూసేందుకు స్వస్థలానికి వచ్చిన ఆమెను ఉక్రెయిన్‌ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పని చేస్తున్న అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు రష్యా అధికారులు గుర్తించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను అరెస్టు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా 51 డాలర్ల నగదును ఆ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసినట్లు ఆమె అంగీకరించడంతో దేశద్రోహం కింద అభియోగాలు మోపిరష్యా కోర్టు ఆమెకు 12ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version