కెన్యాలో 42 మంది మహిళలను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..!

-

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రపంచంలోని ఏ దేశంలో నైనా ఇదే తంతు కొనసాగుతోంది. మహిళల రక్షణ కొరకు ఎన్ని చట్టాలను తీసుకున్నప్పటికీ ఆ దుర్మార్గుల వద్ద ఆ చట్టాలు పని చేయడం లేదు. ఏదో ఒక విధంగా మహిళ మాత్రం బలి అవుతూనే ఉంది. వివరాల్లోకి వెళ్లితే..  కెన్యాలోని నైరూబీలో రెండేళ్ల నుంచి మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసి చెత్త కుప్పలో పారేసిన కేసులో నిందితుడు దొరికాడు.

ఈ కేసులో 33 ఏళ్ల కొల్లిన్స్‌ జమైసీ కాలుషాను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో తాను 42 మందిని హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని అధికారులు తెలిపారు. ఈ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే శిథిలమైన గదిలో నిందితుడు కాలుషా అద్దెకు ఉండే ఇంటిని తనిఖీ చేయగా.. భారీ ఎత్తున టేపు, నైలాన్‌ సంచులు, పరిశ్రమల్లో వాడే రబ్బర్‌ గ్లౌజులు కనిపించాయి. మృతదేహాలను పారేసే క్రమంలో వీటిని వినియోగించినట్లు గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version