ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న భారత హాకీ జట్టు.. వెనుదిరిగిన షూటర్లు

-

టోక్యో: ఒలింపిక్స్ క్రీడల్లో భారత హాకీ జట్టు దూసుకుపోతోంది. తొలి క్వార్డర్ ముగిసేసరికి స్పెయిన్‌పై ఆధిక్యం సాధించింది. 2-0 తేడాతో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి 15 నిమిషాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

పూల్ ఏ- మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌పై 3-0తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సెయిన్ పై భారత్ పట్టు సాధించింది. తొలి కార్డర్స్‌లోనే రెండు గోల్స్ చేసింది. నాలుగో క్వార్టర్‌లోనే మూడో గోల్స్ చేసింది. రూపిందర్ పాల్ రెండు గోల్స్ చేసి అదరగొట్టారు. 14వ నిమిషంలో సిమ్రన్ జీత్ సింగ్ గోల్ చేశారు.

నిరాశపర్చిన సౌరభ్ చౌదరి, మనుబాకర్  జోడీ

మరోవైపు ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్‌టీమ్‌లో భారత్‌కు నిరాశ మిగింది. క్వాలిఫికేషన్ స్టేజ్ -2లో సౌరభ్ చౌదరి, మనుబాకర్ నిరాశపర్చారు.

8 టీముల్లో 7వ స్థానంతో సరిపెట్టుకున్నారు. క్వాలిఫికేషన్ స్టేజ్-1లో సౌరబ్ చౌదరి జోడీ అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ స్టేజ్-2లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. పతక మ్యాచ్‌లకు అర్హత సాధించలేకపోయింది ఈ జోడీ.

Read more RELATED
Recommended to you

Latest news