కంపెనీల వారీగా అందిస్తోన్న.. మొబైల్‌ డేటా వివరాలు!

-

కంపెనీల వారీగా అన్‌లిమిటెడ్‌ డేటా అందిస్తోన్న మొబైల్‌ డేటా వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ బ్రాండ్‌ కంపెనీలన్ని 100 డేటా స్పీడ్‌తో పాటు అదనంగా వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లను కూడా ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ క్లాసులు, కొత్త వెబ్‌ సరీస్‌లు, యాప్‌ల వాడకం పెరగడంతో ఎక్కువ స్పీడ్‌ ఉండే ఇంటర్నెట్‌ డేటా ప్యాకేజీల వాడకం పెరిగింది. దీంతో ఇంటర్నెట్‌ ప్రొవైడర్స్‌ కూడా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఇప్పటి ఇంటర్నెట్‌ అవసరాల నిమిత్తం కనీసం 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ఉండాలని యూజర్లు కోరుకుంటున్నారు. ఇందులో రిలయన్స్‌ జియోఫైబర్, ఎయిర్‌టెట్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ బ్రాడ్‌బ్యాండ్, ఎంటీఎన్‌ఎల్‌ వంటి సంస్థలు ఇంటర్నెట్‌ డేటాను అందిస్తున్నాయి. వాటి ధరల వివరాలు తెలుసుకుందాం.

రిలయన్స్‌ జియోఫైబర్‌

రిలయన్స్‌ జియోఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ తక్కువ ధరలో 100 ఎంబీపీఎస్‌ డేటా ప్యాకేజీని అందిస్తోంది. వినియోగదారులు రూ.699 ప్లాన్ తో దేశంలో ఎక్కడైనా అన్ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఇందుకు ఒక హోమ్‌ ఫోన్ ను కూడా కంపెనీ అందిస్తుంది. 100 ఎంబీపీఎస్‌ డౌన్ లోడ్, అప్‌లోడ్‌ స్పీడ్, అన్ లిమిటెడ్‌ డేటా, అన్ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ను ఈ ప్లాన్‌ ద్వారా పొందవచ్చు. కానీ, ఈ ప్యాకేజీతో స్ట్రీమింగ్‌ డివైజ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను రిలయన్స్ అందించట్లేదు. దీనికోసం రూ.999 ప్లాన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ 100 ఎంబీపీఎస్‌ డేటా ప్లాన్ రూ.799. దీన్ని ఎంచుకున్న వినియోగదారులు హోమ్‌ ఫోన్ , 100 ఎంబీపీఎస్‌ అప్‌ లోడ్, డౌన్ లోడ్‌ స్పీడ్‌తో అన్లిమిటెడ్‌ డేటా, దేశంలో అన్ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ పొందవచ్చు. అదనంగా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌ వీడియో స్ట్రీమింగ్, వింక్‌ మ్యూజిక్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

ఎంటీఎన్‌ఎల్‌

ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఎంటీఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కూడా సాధారణ ధరల్లోనే 100 ఎంబీపీఎస్‌ డేటా ప్లా¯Œ ను అందిస్తోంది. రూ.777తో రీఛార్జ్‌ చేసుకునే కస్టమర్లకు నెలకు 800 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో పొందవచ్చు. ఈ లిమిట్‌ దాటిన తరువాత డేటా స్పీడ్‌ 1ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. పరిమిత సంఖ్యలో మెరుగైన డేటా స్పీడ్‌ అవసరం ఉన్నవారు ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌

భారత్‌ ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీస్‌ నెలకు రూ.799తో 100 ఎంబీపీఎస్‌ను ఈ ప్లాన్ అందిస్తోంది. ఫైబర్‌ వ్యాల్యూ పేరుతో ఉండే ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు ప్రతినెలా అన్ లిమిటెడ్‌ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో పొందవచ్చు. కానీ, ఈ ప్లాన్‌ కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా భారత్‌లో అన్ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఆఫర్‌ను, హోమ్‌ ఫోన్ ను అదనంగా అందిస్తున్నాయి.

యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌

యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌ 100 ఎంబీపీఎస్‌కు బదులుగా 150 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా ప్లాన్ ను అందిస్తోంది. రూ.799 ప్లాన్ తో వినియోగదారులు అన్ లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్‌ 100 ఎంబీపీఎస్‌ డేటా ప్యాకేజీని రూ.850తో అందిస్తోంది. ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ కూడా కావాలనుకునేవారు రూ.950తో అన్ లిమిటెడ్‌ డేటా ప్యాకేజీని పొందవచ్చు. అన్ లిమిటెడ్‌ డేటాను అందిస్తున్న సంస్థల్లో టాటాస్కై బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.

ఎక్సైట్‌

ఎక్సైట్‌ సంస్థ దేశంలోని ముఖ్య నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించింది. ఎక్సైటెల్‌ 100 ఎంబీపీఎస్‌ డేటా ప్లాన్ ప్రీపెయిడ్‌ విధానంలో వినియోగదారులు ఎక్కువ లబ్ధి పొందవచ్చు. ఈ ప్లాన్‌ ధర నెలకు రూ.699. కానీ, వినియోగదారులు 3 నెలల బిల్లును ఒకేసారి చెల్లిస్తే నెలకు రూ.565 వసూలు చేస్తారు. నాలుగు నెలల బిల్లు ఒకేసారి చెల్లిస్తే.. నెలకు రూ.508. సంవత్సరం మొత్తానికి ఒకేసారి రీఛార్జ్‌ చేస్తే నెలకు కేవలం రూ.399 మాత్రమే .

Read more RELATED
Recommended to you

Exit mobile version