అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. 400 కిలోల గంజాయి స్వాధీనం

-

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశారు చౌటుప్పల్ పోలీసులు. వారి వద్ద నుండి 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల ఫై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నామన్నారు. పక్కా సమాచారంతో గంజాయి ముఠా ను ఆరెస్ట్ చేసామని తెలిపారు.

ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో గంజాయి తీసుకొని మహారాష్ట్ర కర్ణాటక మీదుగా తరలిస్తున్న గంజాయి ముఠాని గుర్తుంచామన్నారు. డిసిఎం వ్యాన్ లో లోపల ఎవ్వరికి తెలియకుండా గంజాయి తరలిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ కేసులో ఏడుగురు ఉన్నారని.. నలుగురు ను ఆరెస్ట్ చెయ్యగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ గంజాయి నెట్వర్క్ ను నిర్మూలించడానికి కృషి చేస్తున్నామన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్ చౌహన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version