IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 11 మ్యాచ్లలో 8 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 12 మ్యాచ్లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిస్తే ప్లే ఆప్స్ కు కచ్చితంగా చేరుతుంది.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : జైస్వాల్, బట్లర్, శాంసన్, రియాన్, శుభం దూబే, ధ్రువ్ జురెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, చాహల్

 

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రచిన్, రుతురాజ్, మిచెల్, మోయిన్ అలీ, జడేజా, శివం దూబే, ధోనీ, శార్దూల్, దేశ్పాండే, సిమరీత్, తీక్షణ

Read more RELATED
Recommended to you

Exit mobile version