భోజనం చేసిన తర్వాత సోంపు నిజంగానే మంచిదా…?

-

భోజ‌నం చేసిన తర్వాత కాస్తంత సోంపు నోట్లో వేసుకోడం మనందరికీ తెలిసిందే. ఈ పద్దతి ఈనాటిది కాదు ఎప్ప‌టి నుంచో ఒక అలవాటుగా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప‌ద్ధ‌తిని మర్చిపోతున్నారు. ఇలా భోజనం చేసిన తర్వాత సోంపు తినడంలో ఎన్నో రకాల ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం ఎదుర్కొంటున్నాం. భోజ‌నం చేసిన ప్ర‌తి సారీ కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

సోంపు తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. BP, షుగర్,క్యాన్సర్, రక్తహీనత లాంటి అనేక సమస్యలకు ఔషదం గా పనిచేస్తుంది. పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారేందుకు స‌హ‌క‌రిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో కొవ్వు కూడా చేర‌కుండా ఉంటుంది.

భోజనం చేసిన తరువాత సోంపు తినడం వల్ల తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. భోజ‌నం తర్వాత సోంపును తినడం వల్ల నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి.నెలసరి స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు నొప్పితో బాధ పడేవారు ఆ సమయంలో భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే నొప్పి త‌గ్గుతుంది.

సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో జ‌రిగే ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు. ఇది ర‌క్త‌హీన‌త తో బాధపడుతున్న వారు సొంపుని వాడటం వల్ల ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఎక్కువ‌ వృద్ది అయ్యేలా చేస్తుంది.

సోంపు లో ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌తో ర‌క్తం బాగా ప‌డుతుంది. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇది ఎంతో మేలు చేస్తుంది. షుగర్ ఉన్న వారు భోజనం చేసిన తర్వాత సోంపు తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సోంపు గింజ‌లు ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. ఇది బ‌రువు త‌గ్గేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news