ట్విట్టర్ నుంచి తప్పుకున్న ఈలాన్ మస్క్.. ఆ డీల్ క్యాన్సలేనా..?

-

ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకోవాలన్న నిర్ణయాన్ని ఈలాన్ మస్క్ వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా ప్రకటించకపోయినా.. ఆ డీల్‌ను బ్రేక్ చేసేందుకు అవసరమైన కీ పాయింట్‌ను పట్టుకున్నారు. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లకు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వడం లేదని, దీనిపై స్పష్టత ఇచ్చేవరకు టేకోవర్ చేయడం కుదరదని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు. అయితే ట్విట్టర్‌లో 5 శాతం వరకు ఫేక్ అకౌంట్లు ఉంటాయని సీఈఓ పరాగ్ చెప్పగా.. 20 శాతం వరకు ఫేక్ ఖాతాలు ఉంటాయని ఈలాన్ మస్క్ ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి నిజమైన ఖాతాదారులను పరిగణలోకి తీసుకుని ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఈలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ మేరకు 44 బిలియన్ డాలర్ల ప్రపొజల్ కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. అయితే ట్విట్టర్ సీఈఓ పరాగ్ చెప్పిన సంఖ్యకు నాలుగు రెట్లు ఫేక్ అకౌంట్లు ఉన్నాయని, దీనిపై క్లారిటీ ఇచ్చేంతవరకు ట్విట్టర్ టేకోవర్ డీల్ ముందుకు సాగదని పేర్కొన్నారు. 20 శాతం వరకు ఫేక్ అకౌంట్లు ఉన్న సంస్థకు అంత డబ్బు ఖర్చు పెట్టడంలో అర్థం లేదని ఆయన తెలిపారు.

https://twitter.com/Teslarati/status/1526362455680909313?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1526465624326782976%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fbusiness%2Felon-musk-deal-cannot-move-forward-until-he-does-1456781

Read more RELATED
Recommended to you

Exit mobile version