పోస్ట‌ర్ స్సీక్స్ : జ‌గ‌న్ అన్నీ అబ‌ద్ధాలే చెప్తారా? ఓరినాయినోయ్ !

-

మ‌ద్య‌పాన నిషేదం తీసుకువ‌స్తామంటూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ఊద‌ర‌గొట్టిన జ‌గ‌న్ త‌రువాత మాత్రం ఆ సంగ‌తే మ‌రిచారు.అంతేకాదు కొన్ని బ్రాండ్ల మ‌ద్యం ధ‌ర‌ల‌ను సైతం అమాంతం పెంచేశారు.దీంతో ఖ‌జానాకు ఆదాయం పెర‌గ‌డ‌మే కాకుండా అనూహ్య రీతిలో విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొంటోంది వైసీపీ.

ఈ నేప‌థ్యంలో యువ ముఖ్య‌మంత్రి చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాలేనా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.ఇటీవల జంగారెడ్డి గూడెంలో మరణాలకు కల్తీ మద్యమే కారణం అంటూ… టీడీపీ ఆరోపిస్తోంది.అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే బర్నింగ్ టాపిక్ అయింది.అసెంబ్లీలో చివరకు దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చినా ఇదంతా ఆమోద‌యోగ్యంగా లేద‌ని టీడీపీ మండిప‌డింది.ఇదే స‌మ‌యంలో అసలు జంగారెడ్డి గూడెంలో అక్కడక్కడ చోటు చేసుకున్న మరణాలను టీడీపీ వక్రీకరిస్తుందంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని వెల్లడించారు.

ఇంతకీ అసలు ఏపీలో మద్యపాన నిషేధం ఉన్నట్లా.. లేనట్టా..? లేకపోతే గవర్నమెంట్ కు ఇంత ఆదాయం ఎక్కడ నుంచి వస్తోంది. ఎక్కువ రేట్లు పెంచి ప్రజల నడ్డి విరస్తున్నారా..? అనే అనుమానాలు కలుగకమానవు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లతో మద్యం అమ్ముతున్నారని.. నాసిరకం మద్యం అమ్ముతూ… జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి.

నిజానికి మద్యంపై వచ్చే ఆదాయంపై ప్రభుత్వానికి ఆసక్తి లేదంటూ… ఎక్కువ ధరలు ఉంటే పేదలు కొనరనేది ప్రభుత్వం వాదన.. కానీ వ‌స్తున్న ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చూస్తే ఈ వాదన సరైనదేనా..? అని అనిపిస్తుంది.చంద్రబాబు హయాంలో 2016-17 మద్యం అమ్మకాల ద్వారా 4644 కోట్ల ఆదాయం వచ్చింది.జగన్ పాలనలో 2021-22లో 14,500 కోట్ల ఆదాయం వచ్చింది.అంటే రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధం ఉన్న‌ట్టా ?  లేన‌ట్టా?

వాస్త‌వానికి తెలంగాణ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్ముడ‌య్యే మ‌ద్యం నుంచి వ‌చ్చే ఆదాయం క‌న్నా  ఏపీలో మద్యపానంపై వచ్చే ఆదాయం… ఓ విధంగా ఎక్కువే! ఈ విష య‌మై తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంతో ఏపీ పోటీ పడుతున్నా సంబంధిత డ‌బ్బుల‌ను ఏ మంచి ప‌నులకు ఉపయోగిస్తున్నారో కూడా ఇవాళ లెక్కకు అంద‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version