తీగల-పట్నంకు బ్రేకులు..కేసీఆర్ పక్కా స్కెచ్.!

-

ఎమ్మెల్యే సీటు దొరకపోతే చాలు పార్టీ మారిపోదామని అధికార బి‌ఆర్‌ఎస్  పార్టీలో చాలామంది కాచుకుని కూర్చున్నారు. అలా పలువురు ఇప్పటికే పార్టీ మారిపోయారు. అయితే ఇలాగే వదిలేస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అధికార పార్టీని వదిలేస్తున్నారు అంటే ప్రజల్లో చులకన భావం వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వలసలు వెళితే..ఆ పార్టీకి ప్లస్ అవుతుంది.

ఎంత కాదు అనుకున్న ఈ జంపింగులు బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం తెస్తాయి. అందుకే ఆ జంపింగులకు కే‌సి‌ఆర్ నిదానంగా బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీట్లు దక్కని నేతలకు సర్దిచెబుతూ..వారికి వేరే విధంగా న్యాయం చేస్తామని అంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల పార్టీ మారిపోవాలని చూసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు జంప్ అవ్వకుండా బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు టి‌డి‌పి నుంచి వచ్చిన వారే. అయితే గత ఎన్నికల్లో ఈ ఇద్దరు బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

తీగల..మహేశ్వరం బరిలో, పట్నం..తాండూరు బరిలో ఓడిపోయారు. వీరిపై కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి గెలిచారు. ఈ ఇద్దరు బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. సబితా మంత్రి కూడా అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వీరికే సీట్లు అని కే‌సి‌ఆర్ తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో తీగల, పట్నం పార్టీ మారిపోవాలని చూసినట్లు తెలిసింది. తీగల..రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. కానీ ఏమైందో ఏమో గాని..ఈ ఇద్దరు పార్టీ మారలేదు. బి‌ఆర్ఎస్ లోనే ఉన్నారు.

వీరితో కే‌సి‌ఆర్ మాట్లాడి..మళ్ళీ ప్రభుత్వం వస్తే వేరే విధంగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ ఇద్దరు నేతలు పార్టీ మారకుండా ఆగిపోయారు. ఎలాగో పట్నంకు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. పట్నం భార్య వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్. ఇన్ని పదవులు ఉన్నా సీట్ల కోసం కాంగ్రెస్ వైపు చూశారు. ఇప్పుడు కే‌సి‌ఆర్ చెప్పడంతో ఆగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version