ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తాజాగా మాజీ ఇండియా కెప్టెన్ MS ధోని గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మాములుగా ధోని టోటల్ క్రికెట్ కెరీర్ లో ఒక బ్యాట్స్మన్ గా , కీపర్ గా మరియు కెప్టెన్ గా జట్టుకు ఉన్నతమైన సేవలను అందించాడు. ఇంకా ఆటలో ఉత్కంఠ పరిస్థితుల్లో కూడా చాలా కూల్ గా ఉంటూ జట్టుకు విజయాలను అందించిన రోజులు ఎన్నో.. అందుకే ప్రపంచమంతా ఇతన్ని కెప్టెన్ కూల్ అంటూ కితాబిచ్చారు. అయితే ఇషాంత్ శర్మ మాత్రం ధోని మీరందరూ అనుకుంటున్నట్లు కూల్ కాదు దుర్భాషలు ఆడుతూ ఉంటదంటూ ఇటీవల ఒక యు ట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు. ఒకసారి ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తున్న సమయంలో వచ్చి ఏమి అప్పుడే అలసిపోయావా.. ఇక ఓవర్లు వేయలేవా.. వయసై పోయింది ఇక రిటైర్ అయిపో అన్నాడట.
ధోనీ మిస్టర్ కూల్ కాదు.. ప్లేయర్లను తిట్టేవాడు: ఇషాంత్ శర్మ
-