చంద్రయాన్‌-3 విజయం.. ఎంతో గర్వంగా ఉంది : ఇస్రో చైర్మన్‌

-

దేశ చంద్రయాన్‌ 3 ప్రయోగానికి సహకరించిన టీమ్‌‌కు ధన్యవాదాలు తెలిపారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌. దేశానికి స్ఫూర్తిని అందించే కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందన్నారు. చంద్రయాన్‌-2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సాఫ్ట్‌ లాంచ్‌ అంత సులభమైన విషయం కాదు. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరం. చంద్రయాన్‌-3ని ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తికగా చూస్తారు. ప్రతి ఒక్కరూ చంద్రయాన్‌ విజయం కోసం ప్రార్థించారు. తమకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగానికి సహకారాలు అందించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా అడుగుపెట్టి, ఈ ఘనత సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించిందని, ఇస్రో శాస్త్రవేత్తల అచంచల స్ఫూర్తికి, సంకల్పానికి వందనాలని, ఇది ఆరంభం మాత్రమే, ఇక ఎవరూ ఆపలేరని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రయాన్ విజయవంతం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version