జూన్ 2 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ నిన్న ఎంపిక చేసింది.ఈ టీ20 వరల్డ్ కప్ జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కకపోవడంతో అతడి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తుది జట్టులో కొడుకుకి చోటు ఖాయమనుకున్న వారు టీమ్ ప్రకటించిన వెంటనే సంబరాలు చేసుకునేందుకు క్రాకర్స్ కూడా తెచ్చిపెట్టుకున్నారు. తీరా వరల్డ్ కప్కు ఎంపిక చేసిన 15మందిలో తాను లేనని రింకూ తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడని, ఆ వార్త విన్నాక తమ గుండె బద్దలైందని తండ్రి ఖాన్చంద్ర సింగ్ అన్నారు.
కాగా, ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. టీ 20 వరల్డ్ కప్ కి పంత్, శాంసన్ ఇద్దరిలో ఎవ్వరినీ ఎంపిక చేస్తారనే ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. ఇద్దరినీ ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక కే.ఎల్. రాహుల్ కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రిజర్వు ప్లేయర్ గా ఎంపికవుతాడనుకున్న రాహుల్ ని ఎంపిక చేయకపోవడం గమనార్హం.