మూడు రోజులు బాత్‌రూంకు పోకుండా మీరు ఉంటారా?

-

సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగిందో మనందరికీ తెలుసు..అదే విధంగా టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది..సైన్స్ పెరిగినా కూడా మనుషుల్లో మూఢనమ్మకాలు మాత్రం మారలేదు..రోజు రోజుకు పెరిగిపోతున్నాయి..అలాంటి వాటి మత్తులో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నాము అన్న సంగతిని మర్చిపోతున్నారు. ఇకపోతే ఇప్పుడు ఓ వింత ఆచారం జానాలను ఆలోచనలో పడవేసింది. ఓ దేశంలోని ఓ తెగలకు వింత ఆచారం ఉంది. కొత్తగా పెళ్ళైన ఓ జంటకు సంభందించిన ఆచారం.. వారి మొదటి మూడు రోజులు గది లోనే ఉండాలి.. బాత్ రూమ్ కు పోవడం చెయ్యకూడదు.అలా వెళితే పుట్టబోయే పిల్లలు చిన్న వయస్సులోనే చనిపోతారని నమ్మకం..

వామ్మో.. పిల్లలు పుట్టేవరకు ఉంటారో లేదు గానీ, పొట్ట ఉబ్బి చనిపోవడం మాత్రం ఖాయం..ఇలాంటి ఆచారం మన దేశంలో అయితే, బ్రతికి పోయాము..అసలు విషయానికి వస్తే ఈ వింత ఆచారం ఇండోనేషియాలో ఉంది. ఓ తెగ వారు పెళ్లి తర్వాత మూడు రోజుల పాటు బాత్‌రూం ను ఉపయోగించకూడదని కొత్త జంటకు నిషేదాజ్ఞలు విధించారు.

ఇండోనేషియాలోని టిడాంగ్ కమ్యూనిటీకి చెందిన వారు.. వివాహం తర్వాత మూడు రోజుల పాటు వాష్‌రూమ్‌ను ఉపయోగించకుండా కొత్త జంటకు నిషేధం విధిస్తారు.. ఈ నియమాన్ని ఉల్లంఘించడం జంటకు దురదృష్టం వెంటాడుతుందని ఈ తెగకు చెందిన ప్రజలు విశ్వసిస్తారు. వైవాహిక జీవితంలో త్వరగా, విడిపోవడం, జంటలో విశ్వాసం తగ్గడం, చిన్న వయస్సులోనే వారి పిల్లలు మరణిస్తారని ఇలా ఏవేవో నమ్ముతారట..

తాజాగా ఓ జంటకు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఫొటోలో ఉన్న జంటను చూస్తున్నారు కదా.. వీరికి కూడా వివాహమైంది. అయితే.. వారిని ఇంటి లోపలకు పంపిన టిడాంగ్ తెగకు చెందిన కుటుంబసభ్యులు తక్కువ మొత్తంలో ఆహారం, పానీయాలను మాత్రమే అనుమతించారు. మూడు రోజుల తర్వాత వారు స్నానం చేసి ఆపై మరుగుదొడ్డిని ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. బెడ్ రూమ్ ఉన్న ప్రాంతంలో అయితే బాత్ రూమ్ ఉంటే బంధువులు వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉంటారు.మోసం చేయకుండా ఛాలెంజ్‌ పూర్తిచేసేలా జంటలు ప్రయత్నిస్తుంటాయి..అలా మూడు రోజులు ఉన్న వాళ్ళు మాత్రమే హాయిగా ఉంటారని అంటారు..వామ్మో ఇలాంటి ఆచారం మాత్రం మనదేశంలో లేదు..ఉండి, ఉంటే చాలా మంది చనిపోయేవాల్లు..

Read more RELATED
Recommended to you

Exit mobile version