మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం బాగుంటుంది. మంచి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటానికి అవుతుంది. అయితే ఖాళీ కడుపున ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అయితే మరి ఖాళీ కడుపున ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అనేది చూద్దాం. సిట్రస్ ఫ్రూట్స్ వంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపు నొప్పి యాసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అలానే బ్రెడ్ వంటివి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఈ ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకోకండి.
తేనే మరియు వేడి నీళ్లు:
వేడి నీళ్లలో కొద్దిగా తేనె వేసుకుని ఖాళీకడుపుతో తీసుకోవడం వల్ల అదిరే ప్రయోజనాలు మీరు పొందొచ్చు. తేనెలో మినరల్స్, విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. తేనే లో వేడి నీళ్ళు కలిపి తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంటస్టైన్స్ కూడా శుభ్రంగా ఉంటాయి.
బొప్పాయి:
ఖాళీ కడుపుతో బొప్పాయి తీసుకోవడం వల్ల కూడా కడుపు బాగుంటుంది. అలానే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేస్తుంది. గుండె సమస్యలు కూడా వుండవు. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటే కూడా మంచిదే.
డ్రై ఫ్రూట్స్:
ఖాళీకడుపుతో జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష వంటివి తీసుకుంటే కూడా మేలు కలుగుతుంది. ఇలా వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలానే ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.