ఇంతకుముందు జీన్స్ పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ, ప్రస్తుతం జీన్స్ అందరికీ కామన్ అయిపోయింది. ఐతే మనం వేసుకునే జీన్స్ చాలా దళసరిగా ఉంటుంది. కాబట్టి అది వేసుకోవడం వల్ల శరీరానికి గాలి తాకదు. దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. అదీగాక చర్మాన్ని అంటిపెట్టుకునేలా బిగుతైన జీన్స్ ధరించడం మరింత ప్రమాదకరం. బిగుతైన జీన్స్ ధరించడం వల్ల ఉండే ప్రమాదాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మరీ టైట్ గా ఉన్న జీన్స్ ధరించకపోవడమే ఉత్తమం. బిగుతైన జీన్స్ విషయానికి వస్తే ఆడవాళ్ళే అతిగా ధరిస్తారని చెప్పవచ్చు. దీనివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదమూ ఉంది. టైట్ జీన్స్ ధరించడానికి గుండెపోటుకి సంబంధం ఏంటనుకుంటున్నారా? ఇది చదవండి.
బిగుతైన జీన్స్ కాళ్ళలోని రక్తనాళాల మీద ప్రభావం చూపుతాయి. రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడితే అది గుండెకు ఎఫెక్ట్ పడుతుంది. ఆస్ట్రేలియాలో కొంతమంది మహిళలపై జరిపిన పరిశోధనలో తేలిన సమాచారం ప్రకారం బిగుతైన జీన్స్ ధరించిన వారు మూర్చతో పడిపోయారు. ఎక్కువ సేపు ధరిస్తే ఇంకా అనేక ప్రమాదాలు, వెన్నెముక, ఉదరం, వీపు కండరాలు బలహీనపడతాయి.
కడుపు, నడుము, కాళ్ళలో నొప్పి ఉండవచ్చు. ఇలా తరచుగా జరుగుతున్నా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే స్లిప్ డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాళు తిమ్మిర్లు పట్టడానికి బిగుతైన జీన్స్ కూడా ఓ కారణమే. రక్తనాళాల్లో రక్తం సరఫరా సరిగ్గా జరగకపోవడంతో ఇలా జరుగుతుంది. అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బిగుతైన జీన్స్ ధరించకపోవడమే ఉత్తమం. అందం కన్నా ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం అనుకుంటే బిగుతైన జీన్స్ ధరించకండి.