మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మీద భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన నాగవెళ్లి రాజలింగమూర్తిను నిన్న సాయంకాలం గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఆయన బైక్ మీద వెళ్తుండగా.. అడ్డగించిన దుండగులు తల మీద దాడిచేయడంతో పాటు కత్తులతో పొట్ట భాగంలో పొడిచినట్లు తెలిసింది.
దీంతో ఆస్పత్రికి తరలించేలోపే రాజలింగమూర్తి మరణించాడు. అయితే, తన భార్తను చంపించింది బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి అని మృతుడి భార్య ఆరోపించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు గండ్ర మీద చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను వేడుకున్నారు.