గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కావొచ్చు..కేసీఆర్ గాలి కావొచ్చు…ఎప్పుడు విరోధులుగా ఉండే కాంగ్రెస్-టీడీపీలు పొత్తు పెట్టుకోవడం కావొచ్చు…ఇక పరిస్తితి ఏదైనా అంతా టీఆర్ఎస్‌కు అనుకూలంగానే నడిచింది..పూర్తిగా టీఆర్ఎస్‌కు వన్‌సైడ్ విజయం వచ్చేసింది…కేసీఆర్ గాలిలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ చేసిన బడా బడా నేతలు ఓటమి పాలయ్యారు. చాలామంది నేతలు చిత్తుగా ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కూడా ఉన్నారు.
ఓటమి ఎరుగని కిషన్ రెడ్డి అనూహ్యంగా తన కంచుకోట అంబర్‌పేటలో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు..అటు బండి సంజయ్…కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ ఓటములే వారికి ప్లస్ అయినట్లు ఉన్నాయి…మళ్ళీ వెంటనే వారు ఎంపీలుగా గెలిచే అవకాశం దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి..సికింద్రాబాద్ ఎంపీగా, సంజయ్..కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఇలా ఎంపీలుగా గెలవడంతో వారికి మంచి మంచి అవకాశాలు దక్కాయి.
ఒకవేళ కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే…ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసేవారు కాదని చెప్పొచ్చు..అలాగే బండి సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, ఇప్పుడు ఇలా దూకుడుగా రాజకీయం చేయడం లాంటి చేసేవారో లేదో చెప్పలేం. అంటే ఎమ్మెల్యేలుగా ఓడటం వారికి రాజకీయంగా బాగా ప్లస్ అయింది…ఇదే సమయంలో వారికి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా మెరుగు పడ్డాయని చెప్పొచ్చు..ఇప్పుడు తెలంగాణలో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే…టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి వచ్చింది.
నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది…అదే సమయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఈ సారి ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి..నెక్స్ట్ వీరు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఖాయం..కిషన్ రెడ్డి అంబర్‌పేటలో, బండి సంజయ్ కరీంనగర్ లేదా వేములవాడలో పోటీ చేసే ఛాన్స్ ఉంది..ఈ సారి పోటీ చేసి విజయం దక్కించుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంది.