ఏడాదిగా సాగుతున్న రైతుల ధర్నాలకు, నిరసనలకు ఒక్క ప్రకటనతో ప్రధాని మోదీ ఫుల్ స్టాఫ్ పెట్టారు. తాజాగా మూడు వ్యవసాయ చట్టాలు రద్దుచేస్తున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం చేశారు. కాగా పలు రాజకీయ పార్టీలు వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ధర్నాతోనే కేంద్రం దిగివచ్చిందిని ఆపార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి సాగు చట్టాల రద్దుపై స్పందించారు.
సీఎం కేసీఆర్ మహాధర్నా రైతులకు నాయకత్వం వహిస్తుందని ప్రధాని మోడీ నమ్మారని… ఈ సెగ ఢిల్లీ వరకు చేరుతోందనే భయంతోనే రద్దు ప్రకటన చేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమన్నారు. కేసీఆర్ నాయకత్వం రైతులకు దొరుకుతుందని భయమే ప్రధాని ప్రకటన అని తాము భావిస్తున్నామని తెలిపారు. రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు లేకనే ఇన్ని రోజులు సాగిందన్నారు. చట్టాలు ఉపసంహరణ చేసినంత మాత్రాన టీఆర్‌ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు కేసీఆర్ ఉద్యమం చేస్తారని తెలిపారు. విద్యుత్ చట్టాలను మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని మంత్రి జగదీష్ డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేాయాలని.. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.