రామగుండం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయిందన్న అక్కసు ఇవాళ ప్రధాని మోదీ మాటల్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ పై విషం చిమ్మే అజెండాతో మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారని విమర్శించారు జగదీష్ రెడ్డి.
అవాస్తవాలతో పునాదులు వేసి బీజేపీని విస్తరించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం రగిల్చేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు జగదీష్ రెడ్డి. అయితే తెలంగాణ ప్రజలేమీ గుజరాత్ ప్రజల్లాంటి వారు కాదని, ఇలాంటి మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని మోసపుచ్చలేరని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని, హంసలు పాలను, నీళ్లను వేరు చేసినట్టు, తెలంగాణ ప్రజలు విషాన్ని వేరు చేస్తారని వివరించారు జగదీష్ రెడ్డి.