వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎఫెక్ట్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్న జగన్

-

ఏపీలోని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ( Vizag Steel Plant ) ప్రైవేటీకరణ ఆగేది లేదని కేంద్రం తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా విశాఖ పట్నం ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాటాలు చేస్తున్నాయి. అయితే, ఆ పోరాటాల వల్ల ఒరిగేదేమి లేదని తేలుతున్నది. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయమే ఏం చేయాలి? అని చర్చలు జరపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ సర్కారు విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయొచ్చా? అని ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఏర్పడబోయే ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమయ్యే పనుల్లో స్పీడ్ పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.

విజయనగరంలో ఏర్పాటు కాబోయే ఫ్యాక్టరీ పూర్తిగా ప్రైవేటు వారిదే. వారికి సహకారం అందిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు సహకారమందించాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జిందాల్ స్టీల్స్ ఆధ్వర్యంలో విజయనగరంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడబోతున్నది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు స్థానికులకు వచ్చే చాన్సెస్ ఉంటాయి.

అందువల్ల వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కంటే కూడా విజయనగరం స్టీల్ ప్లాంట్ విషయమై జగన్ సర్కారు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విజయనగరంలో ఏర్పాటు కాబోయే స్టీల్ ఫ్యాక్టరీకి అవసరమైన చర్యలు వెరీ స్పీడ్‌గా తీసుకునేందుకు వైసీపీ సర్కారు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఘనమైన చరిత్ర ఉన్నది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు వంటి నినాదాలు అప్పట్లో వినిపించేవి. ఇప్పటికీ ఉన్నాయి. కానీ, ఉద్యమరూపం తీవ్రతరం కాకపోవడం వల్ల అవి నినాదాలుగానే ఉండిపోయాయి. అయితే, స్థానిక ప్రజానీకం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version