ఏపీ రైతులకు గుడ్ న్యూస్…యాసంగిలో వరిపై ఆంక్షలు ఎత్తేసిన జగన్ సర్కార్ !

-

ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి నిన్న సమీక్ష స‌మావేశం నిర్వ‌హింంచారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్,… రైతుల‌కు శుభ‌వార్త చెప్పారు. యాసంగిలో వరిపై ఆంక్షలు ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఇదే పంట వేయాలని రూల్ పెట్టవద్దని.. వారికి నచ్చిన పంట వేసుకొనివ్వండి అంటూ సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Jagan

పంటల కొనుగోళ్ల లో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని… సీఎం జగన్ పేర్కొన్నారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలని.. రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమ‌ని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జ‌గ‌న్‌… దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలని… సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version