నా సమస్య టీ కప్పులో తుఫాను కాదని.. రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీసీసీ టీ కప్పులో తుఫాను మాటల్లో తప్పు లేదని… కానీ పంచాయతీ మూలం వెతకడం లేదన్నారు జగ్గారెడ్డి. ఆటోలో అసెంబ్లీకి తాను వచ్చానని… సోనియా, రాహుల్ గాంధీల అప్పాయింట్ మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే నా ఆవేదన చెప్తానని అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
ఠాగూర్..కేసీ వేణుగోపాల్ దగ్గర పరిష్కారం దొరకదని.. అప్పాయింట్ మెంట్ ఇప్పించకపోతే 15 రోజుల తర్వాత నా నిర్ణయం అని పేర్కొన్నారు. గాంధీ భవన్ లో ఒకరిద్దరు పోతే పోనీ అనే కామెంట్స్ చేశారని తెలుసు అని… పరిష్కారం దొరుకుతుంది అని నేను ఆశించానని… పార్టీ అగ్ర నాయకత్వం మీద నాకు కోపం లేదని పేర్కొన్నారు.
ఆవేదన అయినా చెప్పుకోవాలని నా ఆలోచన అన్నారు జగ్గారెడ్డి.జగ్గారెడ్డి ఎందుకు రోడ్డు ఎక్కాడు అనే దానికి టాగూర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలన్నిటికీ టాగూర్ సమాధానం ఇవ్వాలని… 15 రోజులు వెయిట్ చేద్దాం. నా ఆవేదనకు మందు దొరికితే చూద్దామని వెల్లడించారు జగ్గారెడ్డి.