దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే… జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాజీవ్ కుమార్ స్పందిస్తూ…..’ లోక్ సభ పోలింగ్ తర్వాత అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తాం. భద్రతా కారణాలతో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదు అని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10-12 మంది చొప్పున.. మొత్తం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ భద్రత అందించాలి అని అన్నారు. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేం’ అని ఆయన పేర్కొన్నారు.