టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైన ప్రేక్షకులకు కనబడి దాదాపు మూడేళ్లవుతోంది. ఆయన సినీలవర్స్‌ను చివరగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో పలకరించారు. ఆ తర్వాత వరుసగా ఫిల్మ్స్ చేస్తున్నప్పటికీ కరోనా వలన చిత్రాల విడుదల ఆలస్యమైంది. చివరకు ఆయన నటించిన చిత్రం ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు ఇప్పటి నుంచే సంబురాలు షురు చేసేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తారక్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం దూసుకుపోతున్న శుభ తరుణంలో ఈ నెల 29న వచ్చే బాస్ చిరు ‘ఆచార్య’ కూడా అదరగొడుతుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీలో తండ్రీ తనయుల కాంబో చిరంజీవి, రామ్ చరణ్ లను చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ సినిమా సక్సెస్ ఫార్ములా పట్టుకుని ముందుకు సాగే కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
‘ఆచార్య’లో ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ను రామ్ చరణ్ ప్లే చేయగా, ఆయన సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. వీరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుందని మూవీ యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తండ్రీ తనయుల కలయికలో వచ్చే సీన్లను అత్యద్భుతంగా కొరటాల శివ తెరకెక్కించారని వినికిడి.
అగ్రరాజ్యం అమెరికాలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ 2.6 మిలియన్ డాలర్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు దాదాపు ఒక నెల టైం ఉన్నపుడే ఇంత మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ‘ఆచార్య’ డెఫినెట్ గా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుందని మెగా అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఫిల్మ్ థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.