చంద్రుడే నన్ను చూసి సిగ్గుపడతాడు..అలాంటి నాపై ఆరోపణలా : జితేందర్‌ రెడ్డి

-

చంద్రుడే నన్ను చూసి సిగ్గుపడతాడు..అలాంటి నాపై ఆరోపణలా జితేందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీఫెన్ రవీంద్ర స్క్రిప్ట్ చదివారని.. నేను మున్నూరు రవి కి ఆకామిడేషన్ ఇచ్చానని..ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఎవరికీ షెల్టర్ ఇవ్వలేదు… ఆయన తెలంగాణ ఉద్యమ కారుడు….మళ్ళీ కూడా ఆకామిడేషన్ ఇస్తానన్నారు. నా పిఏ ను కాంటాక్ట్ అయ్యాడు… మున్నూరు రవి ఇదే మొదటి సారి ఉండటం కాదు… ఇంతకు ముందు కూడా ఉన్నాడని గుర్తు చేశారు.

మున్నూరు రవి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పై ఎలాంటి ఆరోపణలు లేవని.. ఇప్పుడు ఆయన మీద జబర్దస్తు గా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా డ్రైవర్ ఏమి తప్పు చేసాడని.. శ్రీనివాస్ గౌడ్ ని ఎందుకు మర్డర్ చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. మీ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు వారందరని.. వారు ఎందుకు హత్యకు ప్లాన్ చేశారని ఆగ్రహించారు.

కేసీఆర్ కు భయం పుట్టుకుందని… బీజేపీ ఎదుగుతుంటే నేతలపై కక్ష లు తీర్చుకుంటారని నిప్పులు చెరిగారు. నా గురించి కేసీఆర్ నీకు తెలియదా ? రాళ్లతో కొట్టించడం తెలంగాణ సంస్కృతా అని నిప్పులు చెరిగారు. సమగ్ర దర్యాప్తు చేయాలని.. సీబీఐ మీద నమ్మకము లేకపోతే జ్యుడీషియల్ విచారణ చేయించండని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాదించుకుంది ఇందుకోసమేనా.. నడ్డా, తరుణ్ ఛుగ్ లు మాట్లాడారు… మీకు అండగా మేము ఉన్నాం భరోసా ఇచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news