టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు…. పదో తరగతి, డిప్లొమా ఉంటే చాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ముంబాయి లోని టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన హోమీ భాభా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పలు పోస్టులని భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

 

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన హోమీ భాభా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు క్యాన్సర్ ఆసుపత్రుల్లో 405 లోయర్ డివిజన్ క్లర్క్, అటెండెంట్, నర్స్ వంటి పోస్టులు వున్నాయి. అయితే వేర్వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా ని పూర్తి చేసుండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి జనవరి 10, 2023వ తేదీ దాకా అవకాశం వుంది. ఇక ఫీజు విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీకి చెందిన వారు రూ.300లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు కట్టక్కర్లేదు.

ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే… రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.18,000ల నుంచి రూ.53,100ల దాకా సాలరీ ఇస్తారు. పోస్టుల వివరాలని చూస్తే.. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 18, అటెండెంట్ పోస్టులు: 20, నర్సు-ఎ పోస్టులు: 212, నర్స్-బి పోస్టులు: 30,
నర్స్-సి పోస్టులు: 55, ట్రేడ్ హెల్పర్ పోస్టులు: 70 వున్నాయి. పూర్తి వివరాల్ని https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=19545#top చూసి అప్లై చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news