ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు… ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీ
ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేసింది. టెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో ఉద్యోగాల‌ను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

 

jobs

ఆఫ్ లైన్ పద్దతి లో అప్లై చెయ్యాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థికి రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు. సెలెక్ట్ అయితే కనుక బెంగుళూర్‌, చెన్నై త‌దిత‌ర ప్ర‌దేశాల్లో పని చెయ్యాలి. ఎలాంటి పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేయనున్నారు. డిసెంబ‌ర్ 24, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మొత్తం 25 ఖాళీలు వున్నాయి. గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో బీఎస్సీ చేసి ఉండాలి. లేదా టెక్స్‌టైల్ రంగంలో బీటెక్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు. ఇక వయస్సు వచ్చేసి 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/applications-post-fellow-textile-testing ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే..

ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/ ను సంద‌ర్శించాలి.
నెక్స్ట్ Applications for the post of Fellow (Textile Testing) లింక్‌లోకి వెళ్ళాలి.
ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఫిల్ చేసి అడ్రెస్ కి అప్లికేషన్ పంపాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version