కూలగొట్టడానికి వైసీపీ ప్రభుత్వం, పేక మేడ కాదు…సినిమా సెట్టింగ్ కాదు – జోగి రమేష్

-

వైసీపీ ప్రభుత్వం కూల్చి వేయడానికి పేక మేడ కాదు…సినిమా సెట్టింగ్ కాదని… ప్రజల నుంచి జగన్ ను ఎవరూ వేరు చేయలేరని తెలిపారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సేవా కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మండలి విప్ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ వాసుబాబు కేక్ కట్ చేశారు. అనంతరం.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చిన నేత వైఎస్ జగన్ అని.. తన యాత్రతో ప్రజల సమస్యలను తెలుసుకున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు.

వాటిని మ్యానిఫెస్టోలో పెట్టి 98 శాతం పూర్తి చేశారని.. బలవంతుడు జగన్‌ను ఎదుర్కోవాలంటే వాళ్ళ శక్తి చాలదన్నారు.అందుకే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆగ్రహించారు. కూలిపోయిన టీడీపీ వైఎస్సార్సీపీ కంచుకోటను కదిలించలేదని.. మన లక్ష్యం 175..చంద్రబాబుతో సహా అందర్నీ ఓడించడమే లక్ష్యమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version