టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంతోష్ కుమార్ కు ప్రతిష్టాత్మక “వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డు లభించింది.
“ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా దేశవిదేశాల్లో మొక్కలు నాటిన నా వృక్ష ప్రేమికులందరిది అన్నారు రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్”
ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్” మరియు “ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా” చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు అందుకోవల్సిన సంతోష్ కుమార్.. అధికారిక కార్యక్రమాల వల్ల అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” రాఘవ, మర్ది కరుణాకర్ రెడ్డి అవార్డును స్వీకరించారు. అవార్డు వేడుకకు అందుబాటులో లేని కారణంగా, తన సందేశం పంపించిన సంతోష్ కుమార్, తనను అవార్డుకు నామినేట్ చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు.