కాజ‌ల్ కొత్త అవ‌తారం.. ఇంట్లోనే ల‌క్షల సంపాద‌న

-

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలిగిన కాజ‌ల్ అగర్వాల్.. ప్ర‌స్తుతం ప్రెగ్నెన్సీ కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉంటుంది. ఇప్పుడు కాజ‌ల్ ఇంట్లోనే ఉండి త‌న భ‌ర్తతో లైఫ్ ను ఎంజయ్ చేస్తుంది. కాగ కాజల్ ఆగర్వాల్ ఇంట్లో ఉండి కూడా ల‌క్షల్లో సంపాదిస్తుంది. కాజ‌ల్ ఆగర్వాల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ కొడుకుతో క‌లిసి యాడ్స్ లో న‌టిస్తుంది. యాడ్ కు సంబంధించిన ఫోటోల‌ను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఒక ప్ర‌ముఖ బిస్కెట్ కంపెనీ అయిన ఒరియో ను ప్ర‌మోట్ చేస్తూ యాడ్ లో న‌టించింది.

ఆ యాడ్ ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ యాడ్ ద్వారా కాజల్ అగర్వాల్ ల‌క్షల్లో రెమ్యున‌రేషన్ అందుకున్న‌ట్టు తెలుస్తుంది. కాగ సినిమాల‌కు దూరం అయినా.. యాడ్ ద్వారా కాజ‌ల్ మ‌ళ్లీ.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. కాగ ఇటీవల కాజ‌ల్ అగర్వాల్ గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో ప‌లు సినిమాల‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. కింగ్ నాగ‌ర్జున ఘోస్టు తో పాటు ప‌లు సినిమాల‌ను కాజ‌ల్ ర‌ద్దు చేసుకుంది. అలాగే కొన్ని సినిమాల‌కు తీసుకున్న రెమ్యూన‌రేషన్ ను కూడా కాజ‌ల్ రిటర్న్ ఇచ్చేసింద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version