ఒక్క పోస్టుతో రూమర్స్ కి చెక్ పెట్టిన కల్కి చిత్ర యూనిట్

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించినప్పటికీ కూడా ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా వైజయంతి మూవీస్ ప్రభాస్కు సంబంధించిన గ్లింప్స్ వదిలి రూమర్స్కు చెక్ పెట్టింది. కల్కీ మే 9న ఆగయా అంటూ ఒక్క పోస్ట్తో సినిమా వాయిదాపై స్పష్టత ఇచ్చింది. ఇక ఈ సినిమా మే 9న రావడం పక్కా అని తెలిపింది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే , దిశా పటానీ, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా మిగతా హీరోల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version