విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న కమల్ హాసన్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆసుపత్రి నుంచి నేరుగా… చెన్నైలోని తన స్వగృహానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు.. కమల్ హాసన్… ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం… నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. మొదట్లో.. కాస్త అసౌకర్యంగా ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. కరోనా నెగిటివ్ వచ్చాక.. కమల్ హాసన్ పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేశారు వైద్యులు.
కాగా నవంబర్ 22 వ తేదీన కమల్ హాసన్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో కమల్ హాసన్ ను చెన్నైలోని… రామచంద్ర మెడికల్ సెంటర్ లో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. దాదాపు పది రోజుల పాటు కరోనాతో పోరాడిన కమల్ హాసన్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఈ విషయం తెలియడంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.