కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప వారణాసి మాటలను తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. హిమ ఒక్కతే మేడపైన నిలబడి ఏడుస్తూ ఉంటుంది. దీప చూసి ఏమైందమ్మా అని అంటే..ఏం చెప్పకుండా వెళ్లిపోతుంది. దీప ఏమై ఉంటుంది, స్కూల్ కి వెళ్లి వచ్చాక ఎవరైనా ఏమైనా అన్నారా అనుకుంటుంది.
ఇంకోవైపు కార్తీక్ పిల్లలు గురించి దీపతో చెప్పి బాధపడతాడు. నా పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటే తట్టుకోలేకపోతున్నాను అంటాడు. దీప..మీకిందాక వారణాసి వాళ్ల బస్తీలో ఏమనుకున్నారో చెప్పాను కదా అంటుంది. కార్తీక్ అది బస్తీ అలానే అంటారు అంటాడు. కానీ దీప మనుషులు ఎక్కడైనా ఒకేళా ఉంటారు అంటుంది. పిల్లలకు కూడా ఎవరో ఏదో చెత్త చెప్పి ఉంటారు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. కార్తీక్ ఏం చెప్పి ఉంటారు, వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవటం ఎలా, అసలు ఇప్పుడు ఏం చెప్తే వాళ్లు నమ్ముతారు అంటూ కంగారు పడతాడు. దీప నిజం చెప్పాలి డాక్టర్ బాబు అంటుంది. కార్తీక్..ఏంటి నీ ఉద్దేశం..పిల్లలకు నిజం చెప్పి నన్ను విలన్ ని చేద్దామనా అంటాడు. నిజం చెప్తే హీరో అవుతారు, అబద్ధం చెప్తేనే విలన్ అనుకుంటారు అని దీప అంటుంది. కార్తీక్ నిజం చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాలి అంటాడు. ఇలా దీప నిజం చెప్పమని చెప్తుంది..కార్తీక్ భయపడతాడు.మన గురించి పిల్లలకి ఎవరో ఏదో చెప్పే ముందే మనమే పిల్లలకి అని చెప్పబోతుంది.కార్తీక్ నీకు దన్నం పెడతాను దీప అంటూ, నిజం చెప్పాలంటే మోనిత గురించి చెప్పాలి..ఇంకోసారి మనమధ్య ఈ టాపిక్ రాకూడదని అనుకుంటున్నాను అంటాడు.
దీప..అత్తమ్మ ఏంటి నీ ఉద్దేశం మేము అబద్ధాలు చెప్పి మీ నోర్లు మూయిస్తున్నామనా అంటుంది. శౌర్య అవును, తలాఒకరకంగా చెప్తున్నారంటే అది అబద్ధం అనే కదా అంటుంది. కాదు..అని పిల్లలకు ముందు చెప్పిన కథనే వివరంగా చెప్తుంది. ఇద్దరం చెప్పింది కరెక్టే, అందుకే మీరు కన్ఫ్యూస్ అయ్యారు. అని మళ్లీ పిల్లలకు స్కూల్ ఉదాహరణను చెప్తుంది. వాళ్లకు అర్థమవుతంది. ఇదే అత్తమ్మ జరిగింది..మీ నాన్న జైల్లో ఉన్నప్పుడు మీ గురించే ఆలోచించి..మీ కోసం తపించిపోయారు. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని మీ నాన్నతో మీరు మాట్లాడకుండా ఉంటారా అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ వేస్తుంది. అంతే శౌర్య, హిమలు కరిగిపోతారు. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో పేపర్లో మోనిత రాయించిన స్టోరీ వస్తుంది. నా బిడ్డకు తండ్రి అతనే..ఓ డాక్టర్ వింత ప్రేమకథ అనే శీర్షికతో వస్తుంది. అది చూసి కార్తీక్ టెన్షన్ పడతాడు. ఇంతలో ఆ పేపర్ శౌర్య లాక్కోని చదువుతుంది. నాన్న ఇది నిజమా అని అరుస్తుంది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.