కార్తీకదీపం 1206: మోనిత గుట్టురట్టు చేసిన దీప..వీడియోతో అసలు నిజం బట్టబయలు..!

-

కార్తీకదీపం ఈరోజ ఎపిసోడ్ లో మోనిత ఇంట్లో ఉన్న దీప..మోనిత గురించి చెప్తూ ఉంటుంది. దొంగసాక్ష్యాలను సృష్టించటం, దొంగమాటలు చెప్పటం, దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్ కొట్టేయటం..అబ్బో మా చిట్టిచెల్లికి ఎన్ని విద్యలు తెలుసో అంటుంది. మోనిత ఏంటో తెలియనట్లుగా..ల్యాబ్ ఏంటి, దొంగతనం ఏంటి, అన్ని అబద్ధాలు చెబుతున్నావు నువ్వు, ఈ మంగళసూత్రం నేనే కట్టుకున్నాను ఒప్పుకుంటాను, గుళ్లో పూజకోసం పదిమందిలో గౌరవం కోసం కట్టుకున్నాను, కానీ ఆ ల్యాబ్ లో దొంగతనం అన్నారు చూడు అదిమాత్రం అబద్ధం, కార్తీక్ వల్లే నేను తల్లిని అయ్యాను, ఓ రోజు బాగా తాగి వచ్చి అని చెప్పబోతుంది..దీప నోరు మూయ్ అని చేయి ఎత్తుతుంది, మోనితకు టెన్షన్..ఉగ్రరూపం దాల్చిన దీప..మోనిత నోటికి వచ్చినట్లుమాట్లాడితే చెంపపగలుకొడతాను, డాక్టర్ బాబుమీద లేనిపోని నిందలు వేస్తే ఊరుకునేదిలేదు మోనిత, ఏం అనుకుంటున్నాం..నువ్వు బారసాలకు పిలిస్తే..నువ్వు ఇచ్చే విందు ఆరగించి చాటుకు వెళ్లి కళ్లనీళ్లు పెట్టుకుని నా బతుకుఇంతే దేవుడా అని బస్తీకి వెళ్తా అనుకున్నావా..ఏమన్నావ్..నేను అబద్ధాలు చెబుతున్నానా..ఇప్పుడే ఇక్కడే ఏది అబద్ధమే, ఏది నిజమో నిరూపిస్తా అని ప్రియమణిని తనకు ఇచ్చిన బ్యాగ్ తీసుకురా అంటుంది.

మోనితకు చెమెటలు పడతాయి..బ్యాగ్ ఇచ్చే లోపే..మోనితను గట్టిగా ఏసుకుంటుంది దీప..ఇంకా శిక్ష మిగిలే ఉన్నట్లు ఉందిగా..దానికితోడు కొత్త తప్పులకు కూడా శిక్ష అనుభవిద్దుగానీ వెయిట్ చేయి అని..ఆ బ్యాగ్ లోంచి..పేపర్స్ తీసి..ల్యాబ్ నుంచి నీకు శాంపిల్ ఇచ్చినట్లు ఓనర్ రాజారావు రాసిచ్చిన స్టేట్ మెంట్ అంటుంది దీప. మోనిత అబద్ధం, నాది సహజమైన గర్భం అంటుంది. అరవకు మోనిత నీ గుండె ఆగిపోయే సాక్షం చూపిస్తాను అని చెప్పి..ల్యాబ్ ఓనర్ శాంపిల్ మోనితకు ఇచ్చినట్లు ఒప్పుకున్న వీడియోను చూపిస్తుంది.

చిట్టిచెల్లి ఇప్పుడు అరవమ్మా, ఏది అబద్ధం, ఆయన నీకు శ్రీవారు, వీళ్లు నీకు అత్తమావలు, బారసాల ,అతిథిలు, ఆర్బాభాటాలు..ఏంటి చెల్లమ్మ మాట్లాడవేంటి అంటుంది దీప.. మోనిత అందరని వెళ్లిపోమంటుంది. బారసాల లేదు ఏమిలేదు గెట్ ఔట్ అంటుంది. దీప మాటలతో సౌందర్య వాళ్ల మొఖాలు వెలిగిపోతాయి. ఇంతటితో అయిపోయిందని అనుకోకు దీప, నా ప్రేమ అనంతం, అందరూ కలిసిపోయారాని, అందరూ ఒక్కటయ్యారని సంబరపడకు, సినిమా అయిపోలేదు దీప, నేను ఏం చేయగలనో, ఏం చేస్తానో మీరు ఊహించలేరు అంటుంది..సౌందర్య మోనిత చెంపపగలగొట్టి..ఏం చేస్తావే ఏం చేస్తావ్..నా కోడల్ని నువ్వు ఏం చేయలేవ్, నా కోడలు బంగారమే, నీ క్రిమినల్ బ్రెయిన్ తో ఎన్ని ప్లాన్స్ వేసినా నా కోడలు కనిపెట్టింది అని కొడుకు కోడల్ని తీసుకుని ముందుకు వెళ్తుంది.

మోనిత వెళ్లండి..అంతా అయిపోయింది అనుకోకండి..మోనిత ఇక్కడ మోనిత అని వెళ్లి ఏదో ఫైల్ తెస్తుంది. ఈ ఫైల్ చాలు, మీ అందరి జీవితాలు తలకిందులు అయిపోతాయి, మీ అందరి పని అయిపోతుంది, మీ కేల్ ఖతమ్ , వారం రోజుల్లో మీ పని క్లోజ్ అంటుంది. అయినా వాళ్లు కొంచెం కూడా టెన్షన్ పడరు. నవ్వుకుంటూ వెళ్లిపోతారు.

ఇంట్లో కార్తీక్ మేడపైన నుల్చుని జరిగినదాన్ని గురించి ఆలోచిస్తాడు. దీప వస్తుంది. దీప కళ్లలోకి కార్తీక్ అలానే చూస్తాడు. ఎందుకని నన్నే చూస్తున్నారు అని కూడా అడగవా, నీకు అన్నీ తెలుసు, ఏమి తెలియనట్లే ఉన్నావు, మగడాకి ఆవేశంతప్ప ఆలోచన ఉండదు. మోనిత కుట్రతో మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మోనిత ఇది సహజగర్భం అని చెప్పేసరికి నాకు ఈ ప్రపంచం అంత తలకిందులు అయినట్లు అనిపించింది, జరిగింది నీకు చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, నువ్వు తట్టుకోలేవని ఆగిపోయాను, నాలో నేను నరకం అనుభవించాను, ఇలా తను దీప దగ్గర దాచింది అంతా చెప్తాడు. మోనిత మన మధ్య నమ్మకం అనే గోడను అనుమానంతో పగలగొట్టింది. ఇప్పుడు అదే సూత్రాన్ని తిరిగేసి వాడింది. కానీ ఆరోజు మోనిత చెప్పింది నేను నమ్మాను, కానీ నేను నమ్మలేదు..అదే మన ఇద్దరిలో తేడా అంటూ డాక్టర్ బాబు సామెతలు చెప్తాడు. నీకు చెప్పకుండా వెళ్లి సంతకం చేసి వచ్చాను, నీకు చెప్పాల్సింది, నువ్వే దగ్గరుండి సంతకం చేయించేదానివి, ఆయుధం మోనిత చేతికి ఇచ్చాను. నిజాన్ని బయటపెట్టి ఆ మోనిత మొఖాన్ని పగలకొట్టావు, అలా కాకుండా నువ్వు కూడా నా లాగ తొందరపడి..నన్ను వదిలేస్తే నేను ఏం అయిపోయేవాడ్ని. ఇంత నమ్మకం మీ ఆడవాళ్లకు ఎలా సాధ్యం దీప అంటే..నమ్మకం అనే పునాదిమీదే బంధం మీద నడుస్తుంది..ఆ నమ్మకం తోనే ల్యాబ్ కి వెళ్లి అడిగాను..ఆ ల్యాబ్ ఓనరు మొదట అద్భుతంగా నటించాడు..రేండో సారి వెళ్లాను..దొరికిపోయాడు అంటుంది.

ఇంకోవైపు మోనిత ఇంటికి లాయర్ వస్తాడు. ప్రియమణి మా మోనితమ్మ లాయర్ ని పిలిచిదంటే..మళ్లీ ఏం చేస్తుందో అనుకుంటుంది. మరోపక్క కార్తీక్ కుటుంబం అంతా..హాల్ కుర్చోని బాతాకాని కొడుతుంటారు. మోనిత మళ్లీ ఏం ప్లాన్ వేసిందో రేపు చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version