Breaking : గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో కేసీ వేణుగోపాల్‌ భేటీ

-

తెలంగాణలో రాహుల్‌ పాదయాత్రపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో కేసీ వేణుగోపాల్‌ భేటీ అయ్యారు. భారత్‌ జోడో యాత్ర, ర్యూట్‌ మ్యాప్‌లపై చర్చించారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు తెలంగాణలో రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌ వద్ద రాహుల్‌ పాదయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించి… జహీరాబాద్ జిల్లా మద్నూర్‌ వరకు కొనసాగుతుంది. ఈ నెల23 నుంచి వచ్చే నెల 6 వరకు రాహుల్ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది.

The Congress at war in Kerala and the rise of K.C. Venugopal

ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రకటన రిలీజ్ చేశారు. భారత్ జోడో యాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇందుకోసం పంచాయతీ భవన పరిసరాలలో వాల్ రైటింగ్స్ చేయించాలని పార్టీ నాయకులను కోరారు. రాహుల్ యాత్ర ఆద్యంతం ప్రతి రెండు కిలో మీటర్లకు ఓ నాయకుడు బాధ్యత తీసుకొని యాత్ర సజావుగా సాగేలా చూడాలని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news