కేసీఆర్ వ్యూహాలు..ఏపీకి కవిత..ఒడిశాలో బీఆర్ఎస్.!

-

బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే దిశగా కేసీఆర్ దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మొదట తెలుగు ప్రజలు కాస్త ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ముందు ఏపీపై ఫోకస్ పెట్టి..అక్కడ బీఆర్ఎస్ శాఖని ఏర్పాటు చేశారు. ఏపీకి చెందిన కొందరు కీలక నేతలని చేర్చుకున్నారు. ఇక ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ని నియమించారు. ఇంకా అక్కడ పలువురు కీలక నేతలని బీఆర్ఎస్ లోకి తీసుకోచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Ex-Odisha CM Giridhar Gamang Calls On KCR

ఇదే క్రమంలో కేసీఆర్ తనయ కవిత..ఏపీకి వెళ్లనున్నారని తెలిసింది.  ఈ నెల 29న కవిత ఏపీలో పర్యటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఏపీలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య రాజకీయం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను కవిత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ముందుగా చేరికలు..రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి చేయాలని భావిస్తున్నారు. పార్టీలోకి వచ్చే వారికి గుర్తింపు దక్కేలా కమిటీల్లో స్థానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

ఇక ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం  తెలిసిందే. ఈ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొందరు కీలక నేతలు హాజరు అవుతారని తెలుస్తోంది. అదే సమయంలో ఒడిశాలో బీఆర్ఎస్ శాఖ అద్యక్షుడుని సైతం ప్రకటించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. తాజాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, కేసీఆర్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గమాంగ్‌కు ఒడిశా బాధ్యతలు అప్పగించడానికి కేసీఆర్ రెడీ అయ్యారు.

అటు కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత కేసీఆర్ మరింత దూకుడుగా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news