తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు : మోదీ

-

తెలంగాణ బీఆర్ఎస్‌ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవుల నుంచి కింద స్థాయి పదవుల వరకు అన్నీ కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, కొడుకు, కూతురు, బంధువులకు అప్పగించి..తెలంగాణను అన్నీ విధాలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను లూఠీ చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్‌.. తన కుటుంబ సభ్యుల్ని ధనవంతుల్ని చేసుకోవడం తప్ప రాష్ట్రాభివృద్దిని గాలికి వదిలేశారని మోదీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయన్నారు. ప్రపంచానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన ఘనత తెలంగాణదే అని మోదీ కొనియాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇంతకుముందు చెప్పని రహస్యం ఇవాళ చెబుతున్నానని, కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారని, కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారని అన్నారు. అయితే ఇది రాజరికం కాదని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించినట్లు చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version