ఒక్క సీటు పోతే పోయినట్టా… బీజేపీకి 30 పీకినయ్ : కేసీఆర్

-

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉప ఎన్నికల పై సీఎం కేసీఆర్ స్పందించారు. ఒక రాజకీయ పార్టీ అన్నాక ఎన్నికల్లో ఓడుతాం గెలుస్తాం మస్తు జరుగుతాయి అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది పెద్ద విషయమా అంటూ ప్రశ్నించారు. నాగార్జునసాగర్ లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. 119 ఎమ్మెల్యేలకు 110 ఎమ్మెల్యేల బలం మాకు ఉందని కేసీఆర్ అన్నారు.

ఓడితే తెలంగాణ ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినట్టా అంటూ ప్రశ్నించారు. 30 సీట్లలో బిజెపి కి అన్నీ పీకినయ్ అంటూ కెసిఆర్ వ్యాఖ్యానించారు. మరి దేశంలో మీకు వ్యతిరేకత ఉందా అంటూ బీజేపీని కేసీఆర్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ మొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లపై ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version