కేసీఆర్ రివర్స్ ఆపరేషన్..టార్గెట్ కాంగ్రెస్.!

-

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలోకి బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు చేరుతున్నారు. బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కే అవకాశాలు లేని నేతలు కాంగ్రెస్ లోకి జంప్ కొట్టేస్తున్నారు. జులై 2..ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి, జూపల్లిలతో పాటు ఇంకా చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఎంత కాదు అనుకున్న ఈ చేరికలు కాంగ్రెస్‌కు కొత్త ఊపు తెస్తాయి..అలాగే బి‌ఆర్‌ఎస్ పార్టీని టెన్షన్ పెడతాయి. ఈ చేరికలతో బి‌ఆర్‌ఎస్ పార్టీ కి కాస్త ఇబ్బందులు వస్తాయనే చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో బి‌ఆర్‌ఎస్ లోకి చేరికలు పెద్దగా కొనసాగడం లేదు. అదే సమయంలో అటు బి‌జే‌పిలోకి సైతం వలసలు ఆగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కే‌సి‌ఆర్ రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా వలసలు కొనసాగితే..ఆ పార్టీ బలం మరింత పెరుగుతుంది. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకే ఇబ్బంది.

అందుకే కే‌సి‌ఆర్..సైతం కాంగ్రెస్ లోని కొందరు కీలక నేతలకు గేలం వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ కు చెందిన కొందరు నేతలు..కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల టచ్ లోకి వెళ్ళి..వారిని బి‌ఆర్‌ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలు ఉన్నచోట కే‌సి‌ఆర్..అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

ఇలా కొందరు నేతలని తీసుకొస్తే కాంగ్రెస్ బలం తగ్గుతుందని భావిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే సీట్లు కాకపోయిన కొందరికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవుల ఆశ చూపిస్తున్నట్లు తెలిసింది. మరి కే‌సి‌ఆర్ రివర్స్ ఆపరేషన్ లో ఎంతమంది కాంగ్రెస్ నేతలు బి‌ఆర్‌ఎస్ లోకి వస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news