కెసిఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది – అనురాగ్ ఠాకూర్

-

కెసిఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. నేడు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. దళిత బంధు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి విస్మరించారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్రం నిధులతోనే తెలంగాణను అభివృద్ధి చేశారని అన్నారు. తెలంగాణ బిల్ పార్లమెంట్ లో ప్రవేశ ప్రవేశ పెట్టినప్పుడు తాను కూడా ఉన్నానని.. ఎన్నికల సమయంలో చెప్పిన అన్ని విషయాలు మరిచి పోయారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తో పాటు చాలా హామీలు ఇక్కడ అమలు కాలేదన్నారు. మినిమం గవర్నెన్స్, మాక్సిమం కరప్షన్ జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి. మేము ఎయిర్ పోర్ట్ లు నిర్మాణం చేస్తాం అంటే ఇక్కడ నుంచి రిపోర్ట్ రావట్లేదని ఆరోపించారు. నేషనల్ హైవే లు నిర్మిస్తాం అంటే.. ఇక్కడ ల్యాండ్ అక్విసెషన్ చేయట్లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version