తెలంగాణ హోంగార్డులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..30 శాతం జీతాలు పెంపు

-

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డుల జీతాల ను 30 శాతం మేరకు పెంచుతూ ఉన్నట్లు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్.

కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యం లో.. న్యూ ఇయర్ కానుకగా కెసిఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ పెరిగిన జీతా లను.. 2021 సంవత్సరం జూన్ మాసం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్త ర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇటీవలే వివిధ ప్రభుత్వ శాఖలు, ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా వీటికి సంబంధించిన స్పష్టత నిస్తూ ఆర్థిక శాఖ జీవో కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న హోంగార్డుల జీతం RS. 22000 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version