ధాన్యం కొనుగోలు విషయం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య వివాదం జరగుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ మరోసారి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంతో కేంద్ర వైఖరి సరిగా లేదని విమర్శించారు. తాజాగా యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. అయితే కేంద్రం కొనుగోలు చేయకున్నా.. వానాకాలం పంట ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే కేంద్రం తీసుకోక పోతే కొనుగోలు చేసిన పంటను బీజేపీ ఆఫీసుల ముందు, కిషన్ రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం అని హెచ్చిరించారు.
కేంద్రం కొనుగోలు చేయకున్నా… వానాకాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం- సీఎం కేసీఆర్
-