వివాదంలో కేశినేని నాని.. సొంత బాబాయ్ కేశినేని భవన్ దగ్గర ఆందోళన

-

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్‌ నాగయ్య ఆందోళన కు దిగారు. ఎంపీ కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపనలు చేశారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

పోలీసులు, అధికారులు తన గోడు ను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం పక్క నే ఆయన బాబాయ్‌ నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ కేశినేని నాని కార్పొరేషన్‌తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు. కేశినేని నాని దుర్మార్గుడు. నా సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడు. నాకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని కేశినేని నాని బాబాయ్‌ నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version