ఈ నెల 9వ తేదీన ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీసుకుందని.. ఆ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంత రావు ప్రకటించారు. అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ చేయాలని.. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే జరపాలని నెక్లెస్ రోడ్ లో బైక్ ర్యాలీ తీయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదు? అని ప్రశ్నించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు. హై కోర్ట్ ఆదేశాలు ఎప్పటిలానే నిమజ్జనం చేసుకోమని ఉన్నాయని తెలిపారు. “ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫో లేదు…పాండ్స్ ఏర్పాటు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.పాండ్స్ దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదు. ఉత్సవాలను వ్యతిరేకించే వారు అక్కడ ఉంటే ఇబ్బందులు తప్పవు.నిమజ్జనం విషయంలో పోలీసుల నుండి ఎలాంటి వత్తిడి తీసుకరావద్దని కోరారు.