ప్రకంపనలు సృష్టిస్తున్న ఖుషి.. అక్షరాలా ఎన్ని కోట్లంటే..?

-

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో భాగంగానే మొదట మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. ఇందులో భాగంగా పోకిరి మరియు జల్సా లాంటి సినిమాలు రికార్డు స్థాయిలో సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఖుషీ సినిమాను సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు థియేటర్లో ప్రదర్శించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం సినీ లవర్స్ తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ లెవెల్ లో రిలీజ్ అవుతూ అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా కొనసాగుతోంది.

ఇకపోతే రీ రిలీజ్ కి ముందే ఓవరాల్ గా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లెక్క ఏకంగా రూ.2.50 కోట్ల రేంజ్ గ్రాస్ మార్కుని అందుకుని ఊహకందని ఊచకోత కోస్తోంది. సినిమాకి ఆడియన్స్ నుండి అనుకున్న దానికంటే రెస్పాన్స్ అధికంగా వస్తుండడంతో సినిమా ఎక్సలెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం 11 రోజులపాటు ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.

నిజానికి ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొత్తానికి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులలో పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version