టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైన్సు సిటీకి ల్యాండ్ ఇవ్వలేదు… ఎంఎంటీఎస్ రెండో ఫేస్ ప్రారంభించడం లేదు… వరంగల్ లో సైనిక్ స్కూల్ ఇస్తే పెట్టలేదు… మేకపోతు గాంభీర్యం తో మెట్రో పనులు ఆపారు అంటూ ఆయన టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీలో అభద్రతా భావం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు బీజేపీ ని, మోడీ ని తిట్టడమే పని గా కేసీఆర్ కుటుంబం పెట్టుకుంది… మోటర్లకు మీటర్ లు పెట్టాలని కేంద్రం ఎప్పుడు చెప్పలేదు మేము మీ రాజీనామా కోరడం లేదు… ప్రజల మద్దతు కోరుతున్నాం.. ధాన్యం కొనుగోలు పై చర్చకు సిద్దం… మాకు ఓటేసిన ప్రజలకు కుక్క లెక్క విశ్వాసం తో పని చేస్తామన్నారు.
మోడీ పోతున్నారు కేసీఆర్ ప్రధాని అవుతున్నారని దేశమంతా ఫ్లెక్సీలు పెట్టారని, 2018లో రాష్ట్రానికి కేంద్రం బయో ఫ్యూయల్ బోర్డ్ పెట్టాలని లేఖ రాసిందన్నారు. మెడ మీద కత్తి పెట్టడం, అధికార దుర్వినియోగం కి పాల్పడే సంప్రదాయం మీది.. హరీష్ రావు గారు బస్తీ దవాఖానాలు ఎవరివి… మోడీ డబ్బులన్ని తీసుకెళ్లి ఫార్మ్ హౌస్ లో పెట్టాడా… అవినీతి కి పాల్పడ్డారా.. మోడీ అవినీతి చిట్టా ఉంటే విప్పండి అంటూ ఆయన ధ్వజమెత్తారు. ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ విషయం లో లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు… గుజరాత్ స్పందించింది.. టెక్స్ట్ టైల్ పార్క్ కోసం అన్ని రాష్ట్రాలకు లేఖ రాశాము… స్పందించలేదు.. మోడీ ఏ రోజు మిమ్మల్ని ఏమనలేదని ఆయన స్పష్టం చేశారు.